
హైదరాబాద్, వెలుగు: గ్లకోమాపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు. వరల్డ్ గ్లకోమా వారోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం బంజారాహిల్స్ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ లో గ్లకోమా అవేర్నెస్ వాక్ నిర్వహించారు. సజ్జనార్పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. సజ్జనార్ మాట్లాడుతూ.. గ్లకోమా సమస్య 40 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తోందని, గుర్తించకపోతే అంధత్వానికి గురవుతున్నారని చెప్పారు.
దేశంలో దాదాపు కోటి మందికి, ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మందికి పైగా ఈ వ్యాధి ఉందన్నారు. గ్లకోమాపై ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తామన్నారు. కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ సెంథిల్, ఆఫ్తమాలజిస్ట్ డాక్టర్ సిద్ధార్థ్ దీక్షిత్, గ్లకోమా డిపార్ట్మెంట్హెచ్ఓడీ డాక్టర్ శిరిషా సెంథిల్ తోపాటు 600 మంది పాల్గొన్నారు.